మావోయిస్టు ప్రభావిత ప్రాంత. అంతరాష్ట్ర సరిహద్దు లో పోలీసుల నిఘా…!

- Advertisement -
మావోయిస్టు ప్రభావిత ప్రాంత. అంతరాష్ట్ర సరిహద్దు లో పోలీసుల నిఘా…!

పెద్దపల్లి జిల్లా: నవంబర్. 2 (వాయిస్ టుడే) గోదావరిఖని.
భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజు అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఈరోజు రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్., మంచిర్యాల డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేక్షన్, సి.ఆర్.పి.ఎఫ్. అధికారి దినేష్, 002-చెన్నూర్ రిటర్నింగ్ అధికారి సిదాం దత్తు, అధికారులతో కలిసి జిల్లాలోని వేమనపల్లి మండలంలోని సుంపుటం, కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామాలలో ప్రజలకు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి జిల్లాలోని 3 నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలలో భాగంగా ఈ నెల 30న పోలింగ్ అవగాహన
సీపీ రెమా రాజేశ్వరి. మాటాడుతూ….కోటపల్లి మండలం సుంపుటం,జాజులపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సీపీ , కలెక్టర్ సందర్శించి, పోలింగ్ రోజు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఓటు వేయాలి
కోటపల్లి మండలం రాపనపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, బంగారం, కానుకలు ఇతరత్రా రవాణా కాకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, తనిఖీ చేయు సమయంలో వీడియో చిత్రీకరణ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా అధికంగా నగదు, బంగారం, ఇతరత్రా ప్రలోభ పెట్టే వస్తువులను తరలిస్తున్నట్లయితే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు వివరాలతో కూడిన రశీదు అందించాలని తెలిపారు.
ఈకార్యక్రమములో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ టౌన్ సీఐ వాసుదేవా రావు, చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, వేమనపల్లి తహశీల్దార్ సదానందం, ఎస్.ఐ. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular