మున్నూరు కాపు అభ్యర్థి చందర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం…!

- Advertisement -
మున్నూరు కాపు అభ్యర్థి చందర్ ను
ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం…!

మున్నూరు కాపు మహాసభలో తీర్మాణం… పెద్దపల్లి జిల్లా: నవంబర్. 2 (వాయిస్ టుడే) గోదావరిఖని. రామగుండం నియోజకవర్గం చరిత్రలో మెడికల్ కళాశాలలో తీసుకువచ్చింది మున్నూరు కాపు ముద్దుబిడ్డ కోరుకంటి చందరే… మున్నూరు కాపు ల సంక్షేమానికి సొసైటీ నిర్మాణం చేద్దామని మున్నూరు కాపులు అందరు ఐక్యంగా ఉండి ఎన్నికల్లో తనను దీవించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ ప్రవేట్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు ఆత్మీయ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ…
రామగుండం నియోజకవర్గం లోని పెద మున్నూరు కాపు కుటుంబాలకు సహకారం అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పేద కుటుంబంలో పెళ్లి కానీ ఏదైనా విషాదం జరిగితే వారికి ఆర్థిక చేయూతను అందించాలన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మున్నూరు కాపు భవనం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ స్థలాన్ని కేటాయించాలని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేశామని చెప్పారు. మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరో రెండు కోట్లు తాము రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు ముద్దుబిడ్డ పాలనలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు కేసీఆర్‌ ను హ్యట్రిక్ సిఎంగా గెలిపిస్తామని
తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి కార్పొరేటర్లు బోడ్డు రజిత రవీందర్ దాతు శ్రీనివాస్ కొమ్ము వేణుగోపాల్ కౌశిక లత రాకం లతా దామోదర్ ధరణి స్వరూప జలపతి మున్నూరు కాపు సంఘ నాయకులు ముచ్చకుర్తి చంద్రమౌళి తోట వేణు ఇనుముల సత్యం నాయుని శంకర్ మల్క రామస్వామి తోట అనసూర్య చెలకలపల్లి శ్రీనివాస్ మిట్ట తిరుపతి బానకర్ ఆడప శ్రీనివాస్ మెతుకు దేవరాజ్ గండు శ్రావన్ చెలకలపల్లి సతీశ్ భూరుగు వంశీకృష్ణ నాయుని భాగ్యలక్ష్మి శ్రీనివాస్ పుట్ట రమేష్ స్వామి వివేక్ భూదార్ధి శ్రీనివాస్ ఇసంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular