హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీడియా సమావేశం నిర్వహించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు క్యాడర్ కోసం పనిచేస్తా. ఆస్థలు అమ్మయినా సరే ప్రజాసేవలో ఉంటా. నా పైన వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న మంత్రి ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ప్రభుత్వ సీలింగ్ భూములను ఎన్నికలకు నెల రెండు నెలల ముందు ఎన్ఓసి తీసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా బయటికి జైలుకు పంపుతాము. చిన్ననాటి నుంచి నీ స్థాయి ఏందో తెలుసు. హరీష్ రావు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడివై ఉండి లక్షల కోట్ల రూపాయల అవినీతి పాల్పడుతున్నాం.. అవినీతికి పాల్పడే మంత్రి మల్లారెడ్డికి వారి అల్లుడికి టిక్కెట్ ఇచ్చి నాపై బురదల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఢిల్లీ హోటల్ రూమ్లలో భాగవతాలు బయట పెడితే మీరు ఒక్కరు కూడా రోడ్ల తిరగదు. మల్లారెడ్డి నీది నీ అల్లుడుది క్లబ్బులు,పబ్బుల పొంటి . చరిత్ర అవసరమున్నప్పుడు బయట పెడతా ఖబర్దార్. తిరుపతి వెంకన్ననే ఈ ప్రభుత్వ మునుగుతుందని నన్ను కాంగ్రెస్ వైపు నడిపిస్తున్నాడు. ప్రజలలో దేవుని కూడా హేళన చేస్తున్నవు నీకు సరైన గుణపాఠం ప్రజలనుంచి లభిస్తుంది మల్లారెడ్డి. 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలోనే ఉన్నాను కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా. ప్రజా ఆదరణ నాకు ఉంది కచ్చితంగా గెలుస్తాను ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అవినీతి మంత్రుల పని పట్టడం ఖాయం. బఫున్ల వ్యవహరిస్తున్న మంత్రి మరోసారి నోరు జారకు వ్యక్తిగతంగా నన్ను తగ్గించే ప్రయత్నం చేయొద్దు. ప్రజలారా ప్రతిదీ గమనించండి వారిచ్చిన డబ్బులు తీసుకోండి కాంగ్రెస్ గుర్తుకు ఓటేయండని అన్నారు.



