- Advertisement -
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు.. కారు, ఆటోను, బైకు ఢీకొంది. ఆపై ఫుట్పాత్ దగ్గర పార్క్ చేసిన ద్విచక్రవాహనాలపైకి కూడా దూసుకెళ్లింది. ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -



