హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే ): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ సహా మరో 21 రకాల సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లను నిషేధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో మహదేవ్, రెడ్డీ అన్న ప్రెస్టోప్రో యాప్ లు ఉన్నాయి. చట్టవిరుద్ధమైన సిండికేట్ బెట్టింగ్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును అనుసరించి కేంద్రం చర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్ యాప్ కు సంబంధించిన పలు చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. ఆ యాప్ ద్వారా నిర్వాహకులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు తెల్చింది. అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉందంటూ ఈడీ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, తనను యూఏఈ వెళ్లాలని ఆదేశించారంటూ యాప్ కేసులో నిందితుడు శుభం సోనీ ఓ వీడియో విడుదల చేశారు. చట్టవిరుద్ధమైన యాప్‌పై చర్యలు తీసుకునే అధికారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఎ ప్రకారం వెబ్‌సైట్‌ను నిషేధించాలని ప్రతిపాదించే అధికారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఉన్నా పట్టించుకోలేదన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్ , హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, శ్రద్దాకపూర్ , హీనా ఖాన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రణ్‌బీర్ కపూర్ శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరారు. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహం, ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. పెళ్లి కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హావాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్ నిర్వహించిన మరో పార్టీకీ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్మున బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈవెంట్ మేజ్‌మెంట్ సంస్థలు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్ పై ఉత్తర్వులు
Published By Voice Today Team
259
- Advertisement -
- Advertisement -
- Tags
- best betting apps
- best sports betting apps
- betting
- betting app
- betting apps
- betting strategy
- betting tips
- iphone betting apps
- mahadev betting app
- mahadev betting app scam
- mahadev betting app telugu
- mahadev book online betting app
- mahadev online betting app
- sports betting
- sports betting 101
- sports betting app
- sports betting apps
- sports betting apps 2023
- sports betting explained
- sports betting strategies
- sports betting tips
- top betting apps



