- Advertisement -
మధుయాష్కి గౌడ్ కి లక్ష మెజారిటీ ఖాయం: వజీర్ ప్రకాష్ గౌడ్
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ లక్ష ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం తథ్యమని కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ లో మంగళవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ విద్యావేత్త, ఉద్యమకారుడు మధుయాష్కి గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల కిషోర్ గౌడ్, నాయకులు గజ్జె నరహరిగౌడ్, నవీన్ గౌడ్, వాసు గుప్త, గోపి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



