వడాయి గూడెం సర్పంచ్ మనీష్ గౌడ్
యదాద్రి భువనగిరి నవంబర్ 7: భువనగిరి బి ఆర్ ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనివడాయి గూడెం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ అన్నారు. నిన్న రాత్రి వడైగూడెం గ్రామంలో పైల శేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వనిత రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడోసారి పైల శేఖర్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామంలో మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మనీష్ గౌడ్ మాట్లాడుతూ వడైగూడెం గ్రామము పైల శేఖర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇస్తుందని దీనికి గ్రామంలోని ప్రజలు పార్టీలకతీతంగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు ముత్తయ్య గౌడ్ ఉపసర్పంచ్ నీల పోశెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు



