హైదరాబాద్: నవంబర్08: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు. ఈ 20 రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, మరో 14 నియోజకవర్గాల్లో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వీటితోపాటు హైదరాబాద్ సహా పలు నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశమవుతారు.
మంత్రి కేటీఆర్ షెడ్యూల్
8న- సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో, బహిరంగ సభ
9న- ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
10న-సిరిసిల్లలో నామినేషన్
11న- జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్ ప్రతినిధులతో భేటీ
15న- కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో
16న- అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌షో
17న- గోషామహల్, సికింద్రాబాద్‌లో రోడ్‌షో
18న- జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో రోడ్‌షో
19న- మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్,లో రోడ్‌షో
20న- ఎల్బీనగర్లో రోడ్‌షో
21న-శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్‌షో
22న- మల్కాజ్గిరి, ఉప్పల్‌లో రోడ్‌షో
23న- కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో,
బహిరంగసభ, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, చందుర్తి, మేడిపల్లి, రుద్రంగి మండలాల్లో రోడ్‌షో
24న- అచ్చంపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
26న- మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
27న-ఖానాపూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
28న- వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో, పాల్గొంటారు…