Saturday, March 7, 2026

బద్రినాథ్‌ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -

ఉత్తరాఖండ్నవంబర్ 8:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్‌ ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, బద్రినాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ అజేంద్ర అజయ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్రపతి 25 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ అజయ్‌.. రాష్ట్రపతికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక సీఎం ధామీ ఆలయ ప్రతిరూపాన్ని బహూకరించారు. ఆలయ సందర్శన అనంతరం రాష్ట్రపతి శ్రీనగర్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడ హెచ్‌ఎన్‌బీ గర్వాల్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

President Draupadi Murmu visited Badrinath temple
President Draupadi Murmu visited Badrinath temple
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్