- Advertisement -
ఖమ్మం:-మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోదాలకు ఐటీ, ఈడీ అధికారులు రావడం గమనార్హం.

- Advertisement -



