పెద్దపల్లి డిసిసి ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య
కమాన్ పూర్: శ్రీధర్ బాబు గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పెద్దపల్లి డిసిసి ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య అన్నారు. మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ ప్రదాన కార్యదర్శి, సర్పంచ్, కేశోరామ్ యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య హాజరయ్యారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గా శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా భారీ మెజారిటీ తో గెలిపించాలని అది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలనీ సూర సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని కుమార్ నాయకులు కాంగ్రెస్ రానాపూర్ అధ్యక్షుడు మేడగొని రాజయ్య బయ్యపు కమలాకర్ రెడ్డి భయపు దేవేందర్ రెడ్డి పెండ్లి సదానందం ప్రశాంత్ రెడ్డి శ్రీకాంత్ నాగుల రామస్వామి దండగుల రమేష్ ఎరుకల శ్రీధర్ గౌడ్ సాయికుమార్ దార వేణు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు



