30 ఏండ్లలో జరుగని అభివృద్దిని మూడేండ్లలో చేసి చూపిన
జగిత్యాల పట్టణంలో 20 వేల మంది జనాభాకు గూడు కల్పించా
మరో సారి అవకాశం ఇవ్వండి…అద్బుతంగా తీర్చిదిద్దుత
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, తొలిసారి ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ జగిత్యాల నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని, మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించడండి…జగిత్యాల పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అద్బుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి ఎల్. రమణ, జడ్పీ చేర్పర్సన్ దావ వసంతలతో కలిసి సాదాసీదాగా మోతె రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి రిటర్నింగ్ ఆఫీస్ అయిన ఆర్డీవో కార్యాలయానికి వెల్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి పార్టీ కార్యాలయానికి తిరిగివచ్చారు. జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన భారీ జనసందోహంతో మోతో రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. మోతె రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ బైపాస్ రోడ్డులోని దేవీశ్రీ గార్డెన్ ముందు నుండి మార్కండేయ ఆలయం వద్ద గల యావర్ రోడ్డుకు, అక్కడి నుండి కొత్త బస్టాండ్ రస్థా, టవర్ సర్కిల్, మోచీ బజార్ నుండి పాత బస్టాండ్, తహసీల్ రాస్తా మీదుగా తిరిగి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని, నేత్ర వైద్యునిగా ప్రజలకు చేసిన సేవను గుర్తించి 2014లో కేసీఆర్ జగిత్యాల టికెట్ ఇచ్చారని, తొలిసారి ఓటమిచెందినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉన్నానని, దీనికి గాను ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని 2018లో భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేండ్లలో కరోనా మహమ్మారి వల్ల ఆశించినంతగా పనులు సాగలేదని, గడిచిన మూడేండ్లలో 30 సంవత్సరాల్లో కాని అభివృద్దిని జగిత్యాల నియోజకవర్గంలో చేసి చూపించానన్నారు. కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్షకు దిగి కేసీఆర్ తెలంగాణ సాధించారని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ అంటేనే ఓక పెద్ద భరోసా అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపారన్నారు. ఆడబిడ్డల పెండ్లిల్లకు లక్ష రూపాయలు అందించి పేదలకు ఎంతో భరోసానిచ్చారన్నారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని జగిత్యాలను జగిత్యాలను అన్ని రంగాల్లో అద్బుతంగా అభివృద్ది చేశానన్నారు. జగిత్యాలలో ఉన్న చెరువులు, రోడ్లు, బడులు, గుడులు అభివృద్ది చేశామన్నారు. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని బడుల్లో మౌళిక సదుపాయాలు కల్పించి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేశామని, సన్నబియ్యంతో మద్యాహ్న భోజనం అందించామని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే 100 పడకల మాతాశిశు ఆసుపత్రిని, మెడికల్ కళాశాలను, 650 పడకల మల్టీస్పెషాలిటీగల మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిని తీసుకువచ్చామన్నారు. పట్టణంలోని రోడ్లు అభివృద్ది చేసి సెంట్రల్ లైటింగ్‌ను అమర్చామని, పార్కులు, ఓపెన్ జిమ్ములు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాల..జంపాలలు ఊగేలా పార్కులను సైతం అభివృద్ది చేశామన్నారు. జగిత్యాల పట్టణంలో 20 వేల మంది జనాభాకు గూడు కల్పించానని, దీంతో నా జన్మ ధన్యమైందన్నారు.
నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో స్వచ్చ సర్వేక్షన్లో దేశంలోని 751 జిల్లాల్లో జగిత్యాల రెండో స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందన్నారు. ఇలా మనం చేసిన అభివృద్దికి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులు ఇస్తూనే గల్లీలో లొల్లి చేస్తుందన్నారు. మాట్లాడితే పచ్చి అబద్దాలతో బీజేపీ నాయకులు నానాటికి దిగజారి పోతున్నారన్నారు. నేడు ఉన్న బీజేపీ నాటి బీజేపీ ఎంతో విలువలతో, సంస్కారం, సంస్త్రృతి, సంప్రదాయాలు కలిగి ఉండేదని, నేడు ఉన్న బీజేపీకి విలువలు కాని, సంస్కారం,సంస్త్రృతి సంప్రదాయాలను విడనాడి ఓపికలేని బీజేపీగా మారిందన్నారు. 2018లో ఓటమి చెందిన జీవన్‌రెడ్డి ప్రశ్నించేందుకే ఉన్నా అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడితే గెలిపించారని, మరి ప్రశ్నించేందుకు జీవన్‌రెడ్డికి ఇంకా రెండేండ్ల సమయముందని, చివరి దశలో ఉన్న ఆయనకు ఈ సమయంలో పోటీ ఎందుకో అని ఎద్దేవా చేశారు. జగిత్యాల నియోజకవర్గం నా కుటుంబమని, ప్రజలే నా కుటుంబీకులని చివరి వరకు నియోజకవర్గ అభ్యున్నతికే పాటుపడుతానని, ఒక్క సారి గెలిచినందుకే ఇంత అభివృద్ది చేశానని, మరో సారి అవకాశమిస్తే జగిత్యాలను మరింతగా అభివృద్ది చేస్తానని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో రెండో సారి గెలిపించాలని కోరారు.



