శ్రీశైలం: శ్రీశైలంలో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబరు 12వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వ హించిబడనున్నాయి.భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్తీక మాసోత్సవాలకు వి విధ విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి.కాగా ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శనివారం రోజు దర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాదికారువారు డి. పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శన కౌంటర్లు, పార్కింగు ప్రదేశాలు, టూరెస్ట్ షెడు కల్యాణకట్ట,డార్మెటరీ మొదలైన వాటిని పరిశీలించారు.అ దేవిధంగా గణేశ సదనం కూడా వీరు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గణేశ సదనం బాడుగ రాబడిని సమీక్షించారు. ఈ పరిశీలన సందర్భంగా కార్తీకమాస ఏర్పాట్ల గురించి ముం దుగా కార్యనిర్వహణాధికారివారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారికి వివరించారు.తరువా త దర్శకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ క్యూకాంప్లెక్స్లోని భక్తులు నిరంతరం మంచి నీరు . అల్పాహారం, బిస్కెట్లు అందజేస్తుండాలన్నారు. క్యూలైన్లలో శుచి శుభ్రతకు ప్రాధాన్యక ఇవ్వాలని అన్నాడు.ఆయా పార్కింగు ప్రవేశాలకు చేరుకోవలసిన దారులు మరియు వార్నింగు స్థలాలు, స్పష్టంగా తెలిసేవిధంగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నాడు. ముఖ్యంగా ట్రాఫి క్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.క్షేత్ర పరిధిలోని అన్ని శౌచాలయాల శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పాతాళగంగ మెట్లమార్గంలోని డార్మెటరీల వారి తెలిసే విధంగా పలుచోట్ల సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
కళ్యాణకట్టలో కేశఖండనానికి వచ్చే భక్తుల పట్ల మర్యాలతో మెలగాలని అక్కడి సిబ్బందికి సూచించారు. కాగా ఏర్పాట్ల పరిశీలిం చిన సందర్భంగా కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు మాట్లాడుతూ యే రోజులలో దర్శనం వేళలు, దర్శనానికి పట్టే సమయం మొదలైన సమాచారాన్ని ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా నిరంతరం తెలియజేస్తుండాలన్నారు. క్యూలైన్ల వద్ద భక్తులకు సమాచారం తెలిసే విధంగా మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా తగినంత స్థాయిలో విద్యుద్దీపాలు వెలిగే విధంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. పార్కింగు ప్రదేశాలు, వాటి పరిసనాలన్ని శుభ్రంగా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.కల్యాణకట్టలో కేశఖండానికి వచ్చే భక్తులు అధికసమయం వేచి వుండకుండా ఉండేందుకు వీలుగా ఆవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కళ్యాణకట్టను ఎప్పటికిప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్మిటరీలలో విద్యుధీపాలు మరియు ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా నిరంతరం తనిఖీలు చేస్తుండాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. కార్తికమాసాన్ని దృష్టిలో ఉంచుకొని రధశాలకు కుడివైపున ఉన్న శివ వీధిలో చలువపందిర్లు
వేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా టూరిస్ట్ షెడ్ల ముందుభాగంలో (బి.టి. రహదారికి కుడివైపు భాగంలో) సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగు వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కాంక్రీట్ ఫ్లోరింగు వేసేందుకు అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారులు ఫణీదర ప్రసాద్, హరిదాసు. శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, పర్యవేక్షకులు టి. హిమబిందు. కె.అయ్యన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఐ.సి) పి.వి. సుబ్బారెడ్డి.. సహాయ ఇంజనీర్లు భవన్, చిరంజీవి. ఉన్యానవన అధికారి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్తీకమాస ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్, కార్యనిర్వాహణాధికారి
- Advertisement -
- Advertisement -



