
ప్రచారం పేరుతో కాలుష్యం పెంచుతున్నారు
వాహన ర్యాలీలపై నియంత్రణ పాటించాలి
ఎన్నికల సంఘం పర్యవేక్షణ ముమ్మరం చేయాలి
రాజకీయ పార్టీలకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వినతి
హైదరాబాద్ నవంబర్ 11: గెలువు ఆరాటంలో వందల వాహనాలతో కాలుష్యాలు పోగుపెడుతున్నారని, తక్షణమే వాహన ర్యాలీలకు బ్రేక్ వేయాలని “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. శనివారం కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీహెచ్ రంగయ్య బాగ్ లింగం పల్లి కౌన్సిల్ కార్యాలయంలో మాట్లాడుతూ. .. వ్యవస్థ సంక్షేమానికి పాటు పడాల్సిన రాజకీయరంగం ఎన్నికల పేరుతో ధ్వంస రచనకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు వారి మెహర్బానీ కోసం ప్రచారంలో నిబంధనలకు మించి, పర్యావరణానికి విఘాతం జరుగుతున్నా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాల కారణంగా మొన్నటి కరోనా విపత్తు సృష్టించిన నష్టం మరిచిపోరాదని ఆయన పార్టీలకు గుర్తు చేశారు. ప్రతి రాజకీయ పార్టీ విజ్ఞత పాటించి ప్రచారంలో వాహన శ్రేణి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం కూడా మరింత నిఘా పెంచి తన వంతు పాత్ర నిర్వర్తించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.



