నేను బీజేపీలోనే ఉంటా

- Advertisement -

నేను బీజేపీలోనే ఉంటా
హైదరాబాద్, నవంబర్ 12,
బీజేపీ నాయకురాలు విజయశాంతి త్వరలో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని బాగా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి బలం చేకూరుస్తూ కాంగ్రెస్ నేత మల్లు రవి కూడా దీన్ని ధ్రువీకరించారు. త్వరలో విజయశాంతి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెప్పారు. ఇంకో రెండు మూడు రోజుల్లో బీజేపీకి టాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారు. ఆ వార్తలన్నీ తప్పు అని విజయశాంతి కొట్టి పారేశారు. బీజేపీని తాను వదలడం లేదని, అదంతా తప్పుడు ప్రచారం అని స్పష్టత ఇచ్చారు. విజయశాంతి పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తాను బీజేపీని ఎందుకు వీడుతానని అన్నారు. మొత్తానికి విజయశాంతి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular