ఖమ్మం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అది నుండి అధర్మ పోరాటమే అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతునే ఉన్నాయి. తుమ్మల నాగేశ్వర రావు కి అధర్మం పోరాటం బాగా అలవాటు. గతం లో నా మీద పోటి చేసి ఓడిపోయినప్పుడు కూడా కోర్టు లో కేస్ వేసి ఓడిపోయాడు. ఇప్పుడు నా నామినేషన్ ను తిరస్కరించాలని తుమ్మల పిర్యాదు చేశారు. తుమ్మల పిర్యాదు కు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు. ఆఫీడవిట్ లో అన్ని సరిగ్గా పొందుపరచినా అయన చెప్పగానే రిటర్నింగ్ ఆఫిసర్ రద్దు చేస్తారా. అయన చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళని అన్నారు.
తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు… నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు.. ఇవ్వలేదు అంటే నా నామినేషన్ సరైంది అనే గా.. నామినేషన్ దాఖలు చేసేటపుడు అక్కడ అందరూ ఉన్నారు. రిటర్నింగ్ అధికారితో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నా నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఆమోదించడానికి వాల్లేమన్న నా చుట్టాలా. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే నాకు ఉదయం 10.30 గంటలకే నోటీస్ ఇచ్చేవారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని అధికారులు సమాధానం ఇచ్చారు. డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. 2018 లో చూపించా.. ఇపుడు నా కుమారుడు డిపెండెంట్ కాదు. గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు, ఇప్పుడు పెళ్లి అయ్యింది. వాడికి జీతం వస్తుంది.. పెళ్ళి అయింది. ఇప్పుడు డిపెండెంట్ కాదు కాబట్టి చూపించలేదు. అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి. సమగ్ర సమాచారం తెలియచెప్పేలి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయి. ఈసీ ఫార్మాట్ ప్రకారం లేదు. మీరు చెప్పేనట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుంది. రైటర్నింగ్ ఆఫీస్ తప్పు చేస్తే కోర్టు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి. మీకు సలహా ఇచ్చింది ఎవరో.. మీ సమయం, నా సమయం వృధా చేయడం తప్ప ఏమైన పనికొచ్చేది ఉందా అని అన్నారు. అధర్మం పోరాటం కాదు ధర్మం పోరాటం చెయ్యాలి అని తుమ్మలకు నా సలహా. అబద్దపు ప్రచారం చెయ్యకండి, మీ నలభై రాజకీయ జీవితానికి మచ్చలా నిలిచిపోతుంది. గడచిన ఇన్నేళ్ల పాటు మీరు చేసింది ఇదే. ఓటమిని తట్టుకోలేక ఇలా చేస్తున్నావ్. దమ్ముంటే ధర్మ పోరాటం చెయ్యాలి.. వెన్ను పోటు రాజకీయాలు ఎందుకు మీకు మర్యాద అనిపించుకోదని అన్నారు.
తుమ్మలది ఆది నుండి అధర్మ పోరాటమే: పువ్వాడ అజయ్
- Advertisement -
- Advertisement -