హిందూ దేవాలయాల భూములు నీ తాత జాగిరా రేవంత్ రెడ్డి
బీజేవైఎం మండల అధ్యక్షులు పీసు రాజేందర్ రెడ్డి
వాయిస్ టుడే : మెట్ పల్లి ప్రతినిధి నవంబర్ : 14
కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు బీజేవైఎం అధ్యక్షులు పీసు రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఆలయ భూములు అమ్మి ముస్లింలకు పంచిపెడతా అని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఆ భూములు మీ తాత జాగిరి కాదని అన్నారు. హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ నీ బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. మత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీనీ ముస్లింలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ముస్లిం మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువులకు ముస్లింలకు మధ్యల చిచ్చు పెట్టాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టడం ఖాయమని అన్నారు. ముస్లింలందరూ గతంలో ఉన్నట్టు లేరని వారు కూడా విద్యాబుద్ధులు నేర్చుకున్నారని ఏ పార్టీ ఎలాంటి కుటిల రాజకీయం చేస్తుందో వారికి కూడా తెలిసిపోయిందని ఇక మీ మాటలు వారు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కుల మతాలకు అతీతంగా కలిసి ఉన్న సమాజంలో అలజడులు లేపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే కాంగ్రెస్ పార్టీ ఓడించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని అన్నారు. దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెప్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డం దుర్గప్రసాద్ జిన్నా శ్రీకాంత్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



