శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శ్రీ అమ్మవారి ఆలయమునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, IAS విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు. అనంతరం వీరు కార్తీక మాసం సందర్బంగా దేవస్థానం నందు ప్రదోషకాలంలో నిర్వహించుచున్న ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని దీపములు వెలిగించారు. అనంతరం బాలాలయమునకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శితో పాటుగా ఎన్ టి ఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఐఏఎస్ మరియు అధికారులు ఉన్నారు.




