మునుగోడు: ఎమ్మెల్యే పదవి అంటే సైరన్ కారు, హోదా కాదు. అది ఒక బాధ్యత..” అని అన్నారు మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండలం, నెవిళ్ళగూడెం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మహిళలు, ప్రజలు అంతా.. మంగళ హారతులు, కోలాటాలతో స్వాగతం పలికారు. ఉప ఎన్నికల్లో తనను ఓడించడానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ గ్రామానికి వచ్చిండు. అతనికి పాపం తగిలింది.. టికెట్ కూడా రాలే.. అని ఆయన అన్నారు. తన దెబ్బకు మునుగోడు ప్రజల కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి ఓట్లేపిచ్చుకున్నాడు కెసిఆర్. రాజగోపాల్ రెడ్డి ని ఓడించాలంటే కూసుకుంట్ల ఒక్కడే సరిపోడని.. ప్రభుత్వమంతా మీ కాళ్ళ దగ్గరికి వచ్చిందన్నారు. ఇల్లు లేవు.. రేషన్ కార్డు లేవు.. పెన్షన్లు రాలేదని.. అసెంబ్లీలో ఎంత చెప్పినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదు అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. మునుగోడు నుంచి భారీ మెజారిటతో గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.