ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అభివృద్ధి చేశా.. మరోసారి ఆదరించండి
మహేశ్వరం, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలోని నందుపల్లి, నాగారం గ్రామాలలో మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో డప్పు వాయిద్యాలతో, పూలవర్షంతో, మంగళ హారతులతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో కొంత అభివృద్ధి మిగిలి ఉందని, అభివృద్ధి పూర్తి చేయాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో తనను, కెసిఆర్ ని పెద్ద మనస్సుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దళారులు అభ్యర్థులుగా వచ్చారని, డబ్బుల సంచులు, పారాషూట్లలో దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏనాడు నియోజకవర్గంలో కనిపించని మొఖాలు ఈనాడు కనిపిస్తున్నాయని, ఓటర్లు ఒక్కసారి ఆలోచి బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



