
రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్
రామగుండం నవంబర్ 18: కార్మిక,కర్షక బడుగు బలహీన వర్గాల కలలు నెరవేర్చేది కాంగ్రెసే నని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు.”సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో” భాగంగా శుక్రవారం ఉదయం సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘం కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరి జనరల్ జనక్ ప్రసాద్ తో కలిసి జీడికే 2Aఇంక్లైన్ కార్మికులను కలిసి ఓటు అభ్యర్థించారు అనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… గడిచిన తొమ్మిదేండ్లలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని,తెరాస అనుబంధ కార్మిక సంఘం టిబిజీకేఎస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు చేస్తామని, కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, దానితో పాటుగా కార్మికుల శ్రేయస్సు కోసమే పని చేస్తామని అన్నారు.వారితో పాటుగా ఐఎన్టీయూసీ నాయకులు, ఏఐటియుసి, నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ కార్మికులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు..



