బిఆర్ఎస్, బిజెపిలు దొందు దొందే : వొడితల ప్రణవ్

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమలులో విఫలం

1000 కోట్లతో అభివృద్ధి చేస్తానంటే వద్దన్నమా…?

హుజురాబాద్ కు ఈటెల చేసింది ఏమీ లేదు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్….

హుజురాబాద్:  బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు దొందు దొందేనని, టిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని, బిజెపికి వేస్తే బిఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేట, వెంకట్రావుపల్లి, సిర్శపల్లి, రాంపూర్, జూపాక, బోత్తలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని అన్నారు.  బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే వ్యా సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు  ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

BRS and BJP are together: Voditala Pranav
BRS and BJP are together: Voditala Pranav

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఎవరు ఆపారని అన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉన్నారని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే బిఆర్ఎస్ కు వేసినట్టేనని, బిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ లో రౌడీయిజం పెరిగిపోయిందని అన్నారు. వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపారులకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గ బిఎస్పి అధ్యక్షుడు బండారి సదానందం. కూరపాటి రామచంద్రం.జూపాక గ్రామంలో వార్డ్ మెంబర్లు తాళ్లపల్లి. రాజేందర్ పంజాల సురేందర్ . తాళ్లపల్లి ఎల్లయ్య. మునిగాల కరుణ ఆనందం. బోనగిరి కవిత రమేష్. బొత్తలపల్లి గ్రామంలో బిఆర్ఎస్  గ్రామ సర్పంచ్ సుంకరి స్వరూప చొక్కారెడ్డి లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ సమక్షంలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్,పిసిసి నెంబర్ పత్తి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు తిప్పారపు సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, మండల అధ్యక్షురాలు లావణ్య తోపాటు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular