మంథనిలో కవిత పర్యటన పెద్దపెల్లి జిల్లాలో రోడ్డు షో

- Advertisement -

మంథనిలో కవిత పర్యటన పెద్దపెల్లి జిల్లాలో రోడ్డు షో

పెద్దపల్లి జిల్లా :ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా:నవంబర్ 19
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పెద్దపల్లి, మంథనిలో పర్యటిస్తున్నారు.

సాయంత్రం మూడు గంటలకు మంథని నియోజకవర్గంలోని కాటారంలోని గారేపల్లిలోని ప్రతిపాదిత మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని. కొంచెం ఆలస్యంగా మంథినికి రాత్రి 7:30గంటలకు చేరుకున్నారు.

తరవాత రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని వాణి సూల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలకు కవిత పాల్గొని ప్రసంగిస్తున్నారు.

మంథని బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ నేతృత్వంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలకడంతో పాటు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, మహాముత్తారం, మహదేవ్‌పూర్‌, పమెల, మల్హర్‌, కాటారం మండలాల్లో ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు.

మంథనిలో సందర్శనానంతరం రాత్రి 8,00 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఇక్కడ రోడ్ షో నిర్వహించి జెండా కూడలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.

నగరంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలంలోని సెంటినరీ కాలనీ వాణి సెకండరీ పాఠశాల మైదానాన్ని గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు పరిశీలించారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular