నిజాంపేట మండలంలో ఇంటింటా ప్రచారం చేసిన బీఆర్ఎస్  అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డి

- Advertisement -

మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ,నందిగామ, బచ్చురాజ్ పల్లి పలు గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు.ఇతర పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, సర్పంచ్ నరసింహారెడ్డి,ఎంపీటీసీ బాల్రెడ్డి,మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular