బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను గెలిపించుకుంటాం: ఎమ్మార్పీఎస్

- Advertisement -

బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను గెలిపించుకుంటాం: ఎమ్మార్పీఎస్

నోముల దయానంద్ గౌడ్ కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ: నోముల దయానంద్ గౌడ్

ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే:

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు హాజరై నోముల దయానంద్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నోముల దయానంద్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని, ప్రధాని నరేంద్రమోడీతోనే వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు. మూడు దశాబ్దాల పోరాటం ఫలించే క్షణం ఆసన్నమైనదని అన్నారు. ఎం.ఎస్.పి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి కాళ్ళ పాండు, ఎమ్మార్సీస్ నియోజకవర్గ ఇంచార్జి కొమ్ము మహేష్ లు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ అణగారినవర్గాల పోరాట నేత అని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పక్షాన నిలబడి శక్తివంచన లేకుండా పనిచేసి, బిజెపి పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. గ్రామ స్థాయిలోని ఎమ్మార్పీఎస్ నేతలంతా ఈ బాధ్యత భుజానకు ఎత్తుకొని ఇంటింటికి తిరిగి బిజెపి పార్టీకి ఓటువేయలని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బిజేపితోనే సామాజిక న్యాయం సాధ్యమని, తెలంగాణలో బిసి సీఎంను ప్రకటించి బిజెపి పార్టీ నవశఖానికి నాంది పలికిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రు పురుషోత్తం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ కో-ఇంచార్జి సిద్దిపురం శ్రీకాంత్, అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఇంచార్జి పంది సతీష్, ఇబ్రహీంపట్నం మండల ఇంచార్జి జుట్టు సతీష్, యాచారం మండల ఇంచార్జి మాలి మహేష్, మంచాల మండల ఇంచార్జి ముత్యాల శివకృష్ణ, నాయకులు అర్జున్ రెడ్డి, రమేష్, దండె శ్రీశైలం, తూళ్ల నర్సింహా గౌడ్, బొంగు రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular