చెప్పినవన్నీ చేయకుంటే మళ్లీ ఓటు అడగను
కరెంట్ కావాలా కాంగ్రెస్ బీజేపీ లు కావాలా ఆలోచించండి
హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బిఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ మండలంలోని సింగపూర్, తుమ్మనపల్లి, మాందాటి పల్లి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మూడోసారి కెసిఆర్ ప్రభుత్వమే వస్తున్నప్పుడు ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూడా బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ఆయన అన్నారు. వేరే పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు దుర్వినియోగం అవుతుందని అందుకని ఒకసారి ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఆలోచించి 24 గంటల ఉచిత కరెంటుతో పాటు 19 వేల కోట్ల రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గత తొమ్మిది సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా కొత్త మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజల కోసం మరికొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని అన్నారు. అంతేకాకుండా రేషన్ మీద ప్రతి కుటుంబానికి సన్న బియ్యం కూడా అందిస్తామన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షలకు పెంచుతామని, ఇంట్లో ఎవరైనా అకార మరణం చెంతే వారికోసం ప్రభుత్వమే కెసిఆర్ ధీమా ఇంటిఇంటికి భీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి 5 లక్షల అందిస్తామని అన్నారు. ఆలాగే రైతు బంధు కూడా 16000 పెంచుతామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తర్వాత కెసిఆర్ ని ఓప్పించి 1000 కోట్లు తీసుకువచ్చి హుజరాబాద్ ని అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. మిగిలిపోయిన రోడ్లు, భవనాలు, దేవాలయాలు అన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటే మరోసారి ఓటు కోసం మీ ముందుకు రానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలో లేక మూడు గంటల కరెంటు ఇస్తానన్న కాంగ్రెస్, మోటార్ల దగ్గర మీటర్లు పెడతామన్న బిజెపి కావాలో ఆలోచించుకోవాలన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



