బాత్రూంకు డబ్బులు వసూలు చేసే ఈ ప్రభుత్వంలు ఉచితలు ఎలా ఇస్తారు..?

- Advertisement -
How can these governments that charge money for bathrooms give them free..?

ఒక్కసారి ఓటర్లు ఆలోచించాలి-ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే అభ్యర్థి బద్దం భోజరెడ్డి.

కుబీర్ మండలంలో విస్తృతంగా పర్యటన

ముధోల్ నియోజకవర్గ ఆర్సి ఇంచార్జ్ ప్రతినిధి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో పర్యటించిన అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బద్దం. భోజ రెడ్డి . ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రజల ముందు లేవనెత్తారు. నియోజకవర్గంలో పలు రోడ్లు గ్రామస్థాయిలో సరైన విధంగా లేవని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉన్న సర్పంచులు అప్పుల్లో కూరుకు పోయారని తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతునరు అని రాబోయే కాలంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ పార్టీ మీ సమస్యను పట్టించుకోరు అని ఈరోజు వయసు పైబడిన వారికి టికెట్ కేటాయించారని భారతీయ జనతా పార్టీ యొక్క రూల్స్ ను అతిక్రమించి 73 సంవత్సరాల వ్యక్తికి మతిమరుపున్న వ్యక్తికి టికెట్ ను కేటాయించారాని ధ్వజమెత్తారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై నియోజకవర్గంలో పారిస్తుందని. గ్రామస్థాయిలో బస్టాండ్లు స్మశానాన్ని తలపించే విధంగా ఉన్నాయని. బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఏదైనా ప్రమాదం జరగవచ్చని. తెలిపారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. బాత్రూం కు వెళ్లాలంటే 10 రూపాయలు వసూలు చేసే ఈ ప్రభుత్వాలు ఉన్న ఈ రోజుల్లో ఉచితాలు అంటే ఎలా ఇస్తారు..? ఒక్కసారి నియోజకవర్గం ప్రజలు అందరూ ఆలోచించాలని కోరారు ఇప్పటివరకు సిలిండర్ ని తక్కువ రేటుకు అందించని ప్రభుత్వాలు ఈరోజు తక్కువ రేటుకు అందిస్తామని మీ ముందుకు ఉచిత హామీల ద్వారా మభ్య పెట్టేందుకు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆలోచించండి ఈ క్షణం ఎందుకు హామీలు కురిపిస్తున్నారు అని.? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలపై పట్టించుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని. ఎమ్మెల్యే అన్ని విషయాల్లో పూర్తిగా విప్లమయ్యారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఉన్నా కెసిఆర్ సర్కార్ దేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కార్ అన్నిట్లో విపులమై దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా తయారయ్యారని ఇప్పటికైనా ప్రజలు మేల్కొని తమకు కావలసిన నాయకున్ని ఎన్నుకొని తమ అభివృద్ధిని తామే చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వర్గీయులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular