Monday, April 20, 2026

మేం వస్తే హైదరాబాద్ పేరు మారుతుంది

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ రక్తి కడుతోంది. ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇక ప్రచారానానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మరో ఆసక్తికర హామీనిచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అరగంటలోనే హైదరాబాద్ పేరు మారుస్తా మంటున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఓ వైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతూనే మరోవైపు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అటు అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం హామీలు కురిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి కొనసాగింపుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో ఆసక్తికర హామీని ఇచ్చారు.ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన అస్సాం సీఎం.. చార్మినార్ వద్ద నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అరగంటలో హైదరాబాద్ పేరును మారుస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ పేరును భాగ్య నగర్‌గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం కూడా చెప్పరని హేమంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్