రాజమహేంద్రవరం: గోకవరం అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి వన్యప్రాణుల వేటగాళ్ల హల్చల్ కలకం రేసింది. రెండు షూటింగ్ రైఫిల్స్ తుపాకులతో ఎర్రంపాలెం గ్రామ సమీపంలో వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్ఆనరు. వారి వద్ద నుండి రెండు షూటింగ్ రైఫిల్స్ తుపాకులతో పాటు వారు వచ్చిన వాహనం నల్లరంగు ఫోర్డ్ ఎండీవర్ ఏపి39 ఎఫ్ డబ్ల్యూ 1 నెంబరు గల కారుని స్వాధీనం చేసుకొని గురువారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం ప్రాంతీయ అటవీ సంరక్షణ అధికారి కార్యాలయానికి తరలించారు.

అరెస్టు సమయంలో వాహనంలో అడవి పంది లేదా జింక మాంసం ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు రాజమహేంద్రవరం ప్రాంతీయ అటవీ సంరక్షణ అధికారి కార్యాలయంలో నడిచిన హైడ్రామా
ముగ్గురిలో ఒకరు రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా చేస్తున్న నేషనల్ షూటింగ్ క్రీడాకారుడు ప్రవీణ్, అతని స్నేహితులు సాయి, కరుణాకర్. కేసు నమోదు కాకుండా అటవీ శాఖ అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. వన్యప్రాణులను వేటాడే తీవ్రమైన కేసును నామమాత్రపు పూచికత్తుతో వదిలివేసారంటూ అటవీ శాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నయి.



