హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హైదరాబాద్ పాతబస్తీలోని పలు వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు సమకూరుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు శాస్త్రిపురంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.కాగా, ఇటీవల పొలిటికల్ లీడర్స్ టార్గెట్ గా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహారెడ్డితొ మొదలైన దాడులు కేఎల్ఆర్, తర్వాత మంత్రి సబిత అనుచరులు, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి ఇళ్లల్లోనూ కొనసాగాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్ ఇళ్లు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ దాడులపై ఆయా పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తమను ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు
పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్
Published By Voice Today Team
95
- Advertisement -
- Advertisement -
- Tags
- congress leader pilot rohit reddy
- mla pilot rohit reddy
- mla pilot rohith reddy
- mla rohit reddy
- pilot rohit reddy
- pilot rohit reddy birthday celebrations at tandur
- pilot rohit reddy house warming ceremony
- pilot rohit reddy interview
- pilot rohit reddy latest news
- pilot rohit reddy news
- pilot rohit reddy phone call
- pilot rohit reddy tandur
- pilot rohit reddy wife
- pilot rohith reddy
- rohit reddy
- trs mla pilot rohit reddy
- trs mla pilot rohith reddy



