Up ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని కర్మన్ఘాట్ లో నిర్వహించిన బిజెపి సభకు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను brs మోసం చేస్తూ వస్తుందని అని అన్నారు .బిఆర్ఎస్,mim,కాంగ్రెస్ మూడు ఒకటే అని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండాలన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్న తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాలని ఆయన కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి సామ రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యోగి కోరారు. త్వరలో ప్రారంభం కాబోతున్న రామ మందిరానికి ఎల్బీనగర్ ప్రజలు మి కాబోయే ఎమ్మెల్యే సామ రంగారెడ్డి తో కలిసి రావాలని కోరారు. అందుకోసం ప్రతి హిందువు పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపిని గెలిపించాలని యోగి కోరారు.



