స్కిల్ కేసు సీబీఐ కు అప్పగింత

- Advertisement -

డిసెంబర్ 13 కు వాయిదా వేసిన హైకోర్టు

అమరావతి:  స్కిల్ డెవలప్మెంట్ కేసును  సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కొంతమందికి మాత్రమే నోటీసులు  అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి  తీసుకువచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి పిటిషనర్ అనుమతి కోరారు. కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వటానికి కోర్టు  అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular