Sunday, March 8, 2026

చిరుత దాడిలో మరణించిన చిన్నారికి టీటీడీ ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై హైకోర్ట్ అభ్యతరం

- Advertisement -

విజయవాడ: తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత కుంటుంబానికి 5 లక్షలు నష్టపరిహారంఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్ట్   అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ధనిక ఆలయం ఆయినా డబ్బు చెల్లించక పోవడం ఏమిటని నిలదీసింది. నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ ఆఫిడవిట్లో సుముఖత వ్యక్తం చేసింది. అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాసులు ఏర్పాటు చేసేందుకు కూడా అభ్యంతరం లేదని వైల్డ్ లైఫ్ తెలిపింది.వైల్డ్ లైఫ్, టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పిటీషనర్ తరపు న్యాయవాది యాలమంజుల బాలాజీ కోరారు. సదరు విషయంపపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్