మెదక్: జిల్లా సాధారణ పరిశీలకులు పృధ్వీ రాజ్ బీపీ ఐఏఎస్,జిల్లా పోలీస్ పరిశీలకులు సంజయ్ కుమార్ తుకారాం DIG ,జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాజర్షి షా పోలింగ్ అధికారులు ఈ.వి.ఏం. యంత్రాలను, పోలింగ్ మెటీరియల్ ను చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకుని, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.
బుధవారం మెదక్ , నర్సాపూర్ నియోజక వర్గాలలో ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సాధారణ పరిశీలకులు , పోలిస్ పరిశీలకులు , జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాజర్షి షా తో పరిశీలించి పోలింగ్ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు జి.ఫై.ఎస్. ట్రాకింగ్ ఏర్పాటు చేశామని, తిరిగి రిసిప్షన్ కేంద్రాలకు వచ్చిన తరువాత క్లోజ్డ్ కంటైనెర్ ల ద్వారా స్ట్రాంగ్ రూమ్ లకు జి.పి .ఎస్. ట్రాకింగ్ ద్వారా తరలిస్తామన్నారు.
పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితులలోను తమకు కేటాయించిన కేంద్రాలలోనే బస చేయాలని, ఓటు గోప్యతకనుగుణంగా పోలింగ్ కేంద్రంలో కంపార్ట్మెంట్, సిబ్బంది ఏజెంట్లు కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైన ఫారాలను సిద్ధం చేసుకొని ఉదయం 5. 30 గంటలకు పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి క్లియర్ చేయాలని సూచించారు,.
పోలింగ్ కు సంబంధించి ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఎటువంటి చిన్న సంఘటన దృష్టికి వచ్చినా వెంటానే తెలపాలన్నారు.
అనంతరం కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈసారి ప్రతి టేబుల్ దగ్గర ఓట్ల లెక్కింపును సి.సి.కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, కౌంటింగ్ హాల్ లో రౌండ్ వారీగా ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటించేలా చూడాలని,పోలింగ్ ఏజెంట్ లకు తగు వసతులు కల్పించాలన్నారు.
ప్రతి నియోజక వర్గానికి సంబంధించి రౌండ్ వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసున్న మీడియా కేంద్రంలో పాత్రికేయులకు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లు, రమేష్ ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



