- Advertisement -
ఇంద్రకీలాద్రి: గురువారం సంకట హర చతుర్థి సందర్బంగా ఉదయం చిన్న రాజగోపురం వద్ద ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరం వద్ద వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా గణపతి స్వామి వారికి అభిషేకం, పూజ మరియు గణపతి మంత్రము హవనము(హోమం)ను వైభవముగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, వైదిక సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు హోమంను విశేషముగా తిలకించారు.

- Advertisement -



