- Advertisement -
సిద్దిపేట నవంబర్ 30: మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.మరోవైపు ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
- Advertisement -



