చెదురుముదురు సంఘటనలు మినహా ముగిసిన పోలింగ్‌

- Advertisement -
Polling concluded except for sporadic incidents
Polling concluded except for sporadic incidents

హైదరాబాద్ నవంబర్ 30: చెదురుముదురు సంఘటనలు మినహా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 5 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధార‌ణ ఓట‌ర్లతో పాటు సెల‌బ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్‌ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Polling concluded except for sporadic incidents
Polling concluded except for sporadic incidents
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular