పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల: జిల్లాలోని ఆన్ని నియోజక వర్గాల్లో గురువారం పోలింగ్ ప్రకియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.. ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలంతా కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ ఇతర శాఖ సమన్వయంతో సమార్ధవంతంగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించారన్నారు. పోలింగ్ పూర్తయిన ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఓటింగ్ సామాగ్రి మొత్తం విఆర్కే స్ట్రాంగ్ రూమ్ కు తరలించి అక్కడ కేంద్ర బలగాలతో పటిస్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు.. అంతకుముందు ఎస్పీ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు..



