తిరుమల, డిసెంబర్ 1, (వాయిస్ టుడే): డిసెంబర్ మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం ఉండగా… డిసెంబరు 8న సర్వ ఏకాదశి ఉంది.
తిరుమలలో విశేష ఉత్సవాలు:
డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం.
డిసెంబరు 8న సర్వ ఏకాదశి.
డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం.
డిసెంబరు 17న ధనుర్మాసం ప్రారంభం.
డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర.
డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. స్వర్ణరథోత్సవం.
డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి.
డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.



