హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా పయనిస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి డీజీపీ అంజనీ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. డీజీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీతో పాటుగా రేవంత్ రెడ్డిని కలసిన ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్‌లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ రేవంత్ రెడ్డిని కలవడంపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు వేళ పోలీస్ బాస్‌పై ఈసీ వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్
Published By Voice Today Team
242
- Advertisement -
- Advertisement -
- Tags
- anjani kumar speech
- cp anjani kumar face to face on telangana lockdown
- DGP Anjan Kumar
- dgp anjani kumar
- dgp anjani kumar is serious
- dgp anjani kumar latest news
- dgp anjani kumar live
- dgp anjani kumar news
- dgp anjani kumar serious
- dgp anjani kumar suspensio n news
- dgp anjani kumar suspension
- dgp anjani kumar suspension live
- ec suspended dgp
- ec suspended dgp anjani kumar
- ec suspends anjani kumar
- ec suspends dgp anjani kumar
- ips anjani kumar latest speech



