హ్యాపీ జర్నీ’ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్

- Advertisement -

 హ్యాపీ జర్నీ’ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్
The movie ‘Happy Journey’ releases on September 18.
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు.  గుత్తా ప్రొడక్షన్స్,  కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై  బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘హ్యాపీ జర్నీ’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విమానాశ్రయం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా సందడిగా, సరదాగా కనిపిస్తున్నారు. ట్రావెల్ బ్యాగులు, బ్యాక్‌గ్రౌండ్‌లో విమానం, పేపర్ ప్లేన్ మోటిఫ్ సినిమాకు సంబంధించిన ట్రావెల్ థీమ్‌ను హైలైట్ చేస్తున్నాయి. “Some Trips Change Plans… Some Change Lives” అనే ట్యాగ్‌లైన్.. ఈ పాత్రలు సాగించే ప్రయాణం వారి జీవితాలపై చెరగని ప్రభావాన్ని చూపించబోతోందనే విషయాన్ని సూచిస్తోంది.
‘హ్యాపీ జర్నీ’ కేవలం విదేశీ ప్రదేశాలకు చేసే ప్రయాణం గురించి మాత్రమే కాదు. ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే, ఈ సినిమా రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, వ్యక్తిగత అనుభవాలు, ఒకే ప్రయాణంలో ఏర్పడే బంధాలను ఆవిష్కరిస్తుంది. విభిన్నమైన పాత్రలను కథకు కేంద్రంగా తీసుకుని, భిన్నమైన కోణాలను చూపించడంతో పాటు, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ కోర్‌ను సహజంగా చూపించబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా హార్ట్‌వార్మింగ్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదల తేదీ ఖరారు కావడంతోమేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేసి, సినిమాపై బజ్‌ను మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ నిర్వర్తిస్తున్నారు.
తారాగణం: అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వి దండముడి, వంశీ, రవి శివతేజ పైలా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular