పొన్నం గెలుపు ఊహించినదే.. మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్

- Advertisement -

పొన్నం గెలుపు ఊహించినదే..

మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్

హనుమకొండ/భీమదేవరపల్లి/డిసెంబర్ 4(వాయిస్ టుడే ):

హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ గెలుపు ఊహించినదే అని భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ ను ఆదివారం కలిసి శాలువాతో సన్మానించి,పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో మాడుగుల గోపి, ఒద్ధుల సంపత్, చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్, నరేందర్, తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular