- Advertisement -
బాపట్ల: సూర్యలంక సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సూర్యలంక తీరానికి భారీ సూడులతో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర రూపంలో దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. గంటకి 13కిలో మీటర్ల వేగంతో బాపట్ల – మచిలీపట్నం వైపు తుపాను దూసుకువస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- Advertisement -



