చిన్న సినిమాల నిర్మాతలకు అండగా ఉంటాం : మన ప్యానెల్

- Advertisement -

చిన్న సినిమాల నిర్మాతలకు అండగా ఉంటాం : మన ప్యానెల్

సి కళ్యాణ్ మాట్లాడుతూ :

* నిన్న కొన్ని హామీలు, చేసినవి చూసాము. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి.
* నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కౌన్సిల్ కి గండి కొట్టి గిల్డ్ కు తీసుకుని వెళ్ళి ఆ సొమ్మును అనుభవిస్తుంది ఎవరు? అనేది తెలుస్తుంది.
* మా వాళ్ళు 7 మంది ఉంటే మీ వాళ్ళు 16 మంది ఉన్నారు. గత రెండున్నర ఏళ్లగా మీరేం చేశారు?
* నిన్న వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేస్తున్నారు.
* అధికారంలో ఉంది కూడా నిర్మాతలకు సహాయంగా నిలబడలేదు వాళ్ళు. నిర్మాతల మండలి ఒక ఛారిటీ. నేను మద్రాస్ నుండి ఇక్కడ వరకు వచ్చాను. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి.
* గిల్డ్ వారు నిర్మాతల మండలికి అన్యాయం చేశారు. చిన్న సినిమాలు వల్ల 40 వేల మంది బ్రతుకుతున్నారు. వారి కోసం ఉన్నది నిర్మాతల మండలి.
* చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మన ప్యానెల్ ఉంది.
* ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లైమ్ వచ్చేలా మేము చేసాము.
* ఎన్నికల తర్వాత నేను ప్రెసిడెంట్, ఎన్నికల తర్వాత కచ్చితంగా అందరితో కలిసి పని చేస్తాను.
* గిల్డ్ లో ఉన్న వాళ్ళు కోట్ల రూపాయల సొమ్మును దుర్వినియోగం చేశారు కాని మేము అలా చేయలేదు. మేము దుర్వినియోగం చేశాం అంటే అది ప్రూవ్ చేయమని నిరూపించమనండి.
* వారు చిన్న సినిమాలకు చాలా అన్యాయం చేశారు. మేము పేద నిర్మాతలకు ఇచ్చే డబ్బు గిల్డ్ లో వారిలో వారే పంచుకున్నారు.
* మాలో ఉన్న వారిపై బ్లాక్ డాట్ చూపిస్తే వెంటనే విత్ డ్రా చేసుకుంటాను. సంస్థను పూర్తిగా వాడుకునేది వారే. వారిలో వారికి ఐక్యత ఉండదు.
* సంవత్సరానికి 300 చిన్న సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమా కోసం పని చేసిన వారు బావుండాలి అంటే చిన్న నిర్మాతలు బావుండాలి.

చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ :
* 1990లో చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పుడు పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు లేరు. అక్కడ నుండి ఇక్కడకు పరిశ్రమ వచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా సపోర్ట్ చేశారు.
* కళ్యాణ్ గారు ఉన్నత వ్యక్తి. ప్రసన్న గారు నిలకడగా ఉండే వ్యక్తి.
* నిర్మాతలకు అంత తెలుసు. నిర్మాతల సొమ్మును గిల్డ్ కు తీసుకుని వెళ్ళిపోయారు.
* కౌన్సిల్ లో మేము అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాము.
* మన ప్యానెల్ ను పూర్తి మెజారిటీతో గెలిపించండి. చిత్ర పరిశ్రమను ధర్మంగా ముందుకు నడిపే బాధ్యత మాది. పరిశ్రమలో అందరూ బావుండేలా చూసుకుంటాము.

తుమ్మల ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ :
* గతంలో మమ్మల్ని ఎన్నికల సమయంలో వారు మోసం చేశారు.
* గతంలో నేను చాలా మంది చిన్న నిర్మాతలకు అండగా నిలబడ్డాను.
* ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో క్లియర్ గా ఉంది.
* గిల్డ్ వారి సమస్యలు కూడా కౌన్సిల్ తీర్చింది.
* ఎన్నో పెద్ద సినిమాలకు కూడా మేము అండగా నిలబడ్డాము.
* చిత్ర పరిశ్రమ కోసం, చిన్న సినిమాల కోసం, చిన్న నిర్మాతల కోసం పని చేసేది మేము.
* దానయ్య గారు, సునీల్ నారంగ్ గారు, వంశీ నందిపాటి గారు చాలా మంచి సినిమాలు చేస్తూ కౌన్సిల్ తో నిలబడ్డారు.
* ఆ ప్యానెల్ లో ఉన్న వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. మేము నిలబెట్టుకున్నాము.
* ప్రభుతాల పరంగా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాము.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular