డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఊస కోయిల ప్రకాష్ పూలమాలవేసి నివాళిలు అర్పించారు
భీమడేవరపల్లి వాయిస్ టుడే డిసెంబర్ 6
భీమదేవరపల్లి మండలo కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఊస కోయిల ప్రకాష్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్ది వెంకటనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అంబేద్కర్ భారతదేశ స్థితిగతులను మార్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్య, ఉద్యోగం, సమానత్వం మొదలైన విషయాల్లో అంబేద్కర్ ఒక స్ఫూర్తి తేజంగా అందరికీ ఆదర్శనీయుడన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సమానత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి గాను నేటి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారతదేశంలో అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ పొన్నాల హేమలత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిదురాల స్వరూప, చంద్రశేఖర్ గుప్తా, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, మాడుగుల గోపి, శ్రీరామోజు సమ్మయ్య, గజ్జల సురేష్, పచ్చునూరి కర్ణాకర్, గుడి కందుల రాజు, చిట్కూరి అనిల్, ఆదరి రాజేందర్, గిరబోయిన అఖిల్, అంబాల రాజ్ కుమార్, బొల్లంపల్లి రాజ్ కుమార్, షడ్రక్, డబ్బా శంకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



