Sunday, December 15, 2024

కొలువుదీరిన తెలంగాణ మూడో అసెంబ్లీ

- Advertisement -

ప్రొటెం స్పీక‌ర్‌తో క‌లిపి మొత్తం 101 మంది ప్ర‌మాణం

హైద‌రాబాద్ డిసెంబర్ 9:  తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్రొటెం స్పీక‌ర్ అక్బ‌రుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. మొద‌ట సీఎం రేవంత్ రెడ్డి, ఆ త‌ర్వాత మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, సీతక్క‌, శ్రీధ‌ర్ బాబు, జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌మాణం చేశారు. అనంత‌రం ఎమ్మెల్యేలు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒక‌రు ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేశారు. ప్రొటెం స్పీక‌ర్‌తో క‌లిపి మొత్తం 101 మంది ప్ర‌మాణం చేశారు.

ప్ర‌మాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే..

రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, సీత‌క్క‌, శ్రీధ‌ర్ బాబు, జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, చిట్టెం ప‌ర్ణికా రెడ్డి, మ‌ట్టా రాగ‌మ‌యి, ప‌ద్మావ‌తి రెడ్డి, య‌శ‌స్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆది నారాయ‌ణ‌, ఆడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, అనిరుధ్ రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి, బాలు నాయ‌క్ నేనావ‌త్, చిక్కుడు వంశీకృష్ణ‌, విజ‌య ర‌మ‌ణారావు, దొంతి మాధ‌వ‌రెడ్డి, గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, గ‌డ్డం వినోద్, గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు, మ‌ధుసూద‌న్ రెడ్డి, బీర్ల ఐల‌య్య‌, రామ్‌చంద‌ర్ నాయ‌క్, కేఆర్ నాగ‌రాజు, కే శంక‌ర‌య్య‌, క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, ప్రేమ్ సాగ‌ర్ రావు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కోరం క‌న‌క‌య్య‌, రాజేశ్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జ‌య‌వీర్ రెడ్డి, ల‌క్ష్మీకాంతారావు, మ‌ద‌న్ మోహ‌న్ రావు, మ‌క్క‌న్ సింగ్ రాజ్ ఠాకూర్, మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామేల్, మేడిప‌ల్లి స‌త్యం, తుడి మేఘారెడ్డి, ముర‌ళీ నాయ‌క్ భుక్యా, మైనంప‌ల్లి రోహిత్, నాయిని రాజేంద‌ర్ రెడ్డి, సుద‌ర్శ‌న్ రెడ్డి, ప‌టోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంక‌టేశ్వ‌ర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, రేకుల‌ప‌ల్లి భూప‌తి రెడ్డి, టీ రామ్మోహ‌న్ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గ‌డ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌మాణం చేశారు.

బీఆర్ఎస్ నుంచి ప్ర‌మాణం చేసింది వీరే..

కోవా ల‌క్ష్మి, లాస్య నందిత, ప‌టోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి, అనిల్ జాద‌వ్, అరికెపూడి గాంధీ, బండారి ల‌క్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, చామ‌కూర మ‌ల్లారెడ్డి, చింతా ప్ర‌భాక‌ర్, దానం నాగేంద‌ర్, సుధీర్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, గూడెం మ‌హిపాల్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి, కేపీ వివేకానంద‌, కాలే యాద‌య్య‌, కాలేరు వెంక‌టేశ్‌, క‌ల్వ‌కుంట్ల సంజ‌య్, మాణిక్ రావు, మాధ‌వ‌రం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్‌, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ముఠా గోపాల్, ప్ర‌శాంత్ రెడ్డి, డాక్ట‌ర్ సంజ‌య్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, తెల్లం వెంక‌ట్రావ్, హ‌రీశ్‌రావు, విజ‌యుడు. ప్ర‌మాణం చేశారు.

ఎంఐఎం నుంచి ఆరుగురు ప్ర‌మాణం

అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, జాఫ‌ర్ హుస్సేన్, కౌస‌ర్ మెయినుద్దీన్‌, జుల్ఫీక‌ర్ అలీ, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్, మ‌హ్మ‌ద్ మోబిన్. ప్ర‌మాణం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్