- Advertisement -
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఓ బోరు బావి నుండి గులాబీ రంగు నీళ్ళు రావడంతో ఇంటి యజమాని నివ్వెర పోతున్నాడు.. చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు.. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశర్యం వ్యక్తం చేశారు… ఎంత సేపైనా నీరు రంగు అలాగే రావడంతో ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ చెబుతున్నాడు.. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని.. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఇంటి యజమాని శ్రీనివాస్ కోరుతున్నారు..

- Advertisement -



