జిల్లా స్థాయి భగవద్గీత పోటీలలో కోరుట్ల విద్యార్థి

- Advertisement -

శ్రీరాం కి ప్రథమ బహుమతి

జగిత్యాల డిసెంబర్ 13: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జగిత్యాల జిల్లా స్థాయిలో గీతా జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని గీతా భవనము లో శ్రీమద్భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించగా కోరుట్ల పట్టణానికి చెందిన ఆమేటి శ్రీరాం ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాడు. శ్రీరాం ఆమేటి సురేష్ – వనమాల ల పుత్రుడు. స్థానిక సిద్ధార్థ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు.శ్రీరాం భగవద్గీత లోని 700 శ్లోకాలను మొత్తం కంఠస్థం చేశాడు. శ్రీ రాం ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ క్రిష్ణమూర్తి, జగిత్యాల జిల్లా కన్వీనర్‌ మంచాల జగన్, న్యాయ నిర్ణేతలు గుడికందుల వెంకన్న, పాంపట్టి రవీందర్, తవుటు రాంచంద్రం, జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular