Sunday, December 15, 2024

అత్యంత కాస్ట్లీగా తెలంగాణ ఎన్నికలు

- Advertisement -

 అత్యంత కాస్ట్లీగా తెలంగాణ ఎన్నికలు
నియోజకవర్గానికి 20 కోట్లపైనే ఖర్చు
హైదరాబాద్, డిసెంబర్ 15
హోరాహోరీ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఎలా సాధించిందనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం అనుకున్నరాష్ట్రాల్లో ఓటమి పాలై తెలంగాణలో విజయం సాధించడం వెనుక సీక్రెట్ ఏమిటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపును ప్రభావితం చేసిన అంశాలు ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పదేళ్ల బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ఎన్ని కారణాలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగు పరిచిన అంశాలు ఏమిటని నేతల మధ్య చర్చ జరుగుతోంది.దేశంలో రాజకీయాలు అత్యంత ఖరీదుగా మారిపోయిన వేళ తెలంగాణలో ఆర్ధికంగా బలమైన పునాదులు ఉన్న బిఆర్‌ఎస్ పార్టీని మట్టి కరిపించడం వెనుక పక్కా వ్యూహ‍ం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సాంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలకు భిన్నమైన వ్యూహాలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసినట్టు చెబుతున్నారు.సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే అతనికి వ్యతిరేకంగా వరుస ఫిర్యాదులతో క్యూ కట్టే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. రేవంత్‌ రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించడం గిట్టని వారు కాలికి బలపం కట్టుకుని ఎన్ని ఫిర్యాదులు చేసినా పార్టీ అధిష్టానం వాటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు.రేవంత్ రెడ్డికి అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ప్రతి విషయంలో కావాల్సినంత స్వేచ్ఛను గాంధీ కుటుంబం ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో పాటు షర్మిలను ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోకపోవడం వంటి విషయంలో కూడా పంతం నెగ్గించుకున్నారు.తెలంగాణ అంతట బిఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోలిగారు. క్షేత్ర స్థాయిలో బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మితిమీరిన విశ్వాసంతో ఉండటం, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడం కలిసొచ్చిందని చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహ‍రించినట్టు చెబుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలవడం కూడా కీలకమైన విషయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాలు, బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు అభ్యర్థులకు ఆర్ధికంగా అండగా నిలవడం కూడా కీలకంగా పనిచేశాయని చెబుతున్నారు.ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బలమైన ఆర్ధిక వనరులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కతాటిపై పనిచేసినట్టు చెబుతున్నారు. అయా జిల్లాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతల్లో కొంత భారాన్ని జిల్లాలో ముఖ్య నేతలు భరించినట్టు చెబుతున్నారు.అనధికారిక లెక్కల ప్రకారం 2009 ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల వ్యయం గణనీయంగా పెరిగినట్టు చెబుతున్నారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి సిఎం కోటి రుపాయల వరకు ఆర్ధిక సాయం చేసినట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.తాజా ఎన్నికల్లో ఈ వ్యయం భారీగా పెరిగిందని పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి వారి ఆర్ధిక అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానిక నాయకత్వం కూడా అండగా నిలిచిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో అత్యతం ఖరీదైన ఎన్నికలు తెలంగాణలోనే జరిగి ఉంటాయని ఓ నాయకుడు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఓ నాయకుడి అంచనా ప్రకారం సగటున ఒక్కో అభ్యర్థికి పదికోట్ల కంటే ఎక్కువ ఖర్చై ఉంటుందని తెలిపారు.కొన్ని చోట్ల అంతకు మించి కూడా ఖర్చై ఉండొచ్చని అంచనా వేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త ఖర్చు తగ్గినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యయం కళ్లు చెదిరే లెక్కల్లో ఉంటుందని వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్