- Advertisement -
తమిళనాడులో మరో రెండు రోజులు వర్షాలు
చెన్నై
తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఇంకా వరద నీటిలోనే
పలు ప్రాంతాలు ఉన్నాయి. వరదల కారణంగా గత రెండు రోజుల్లో 10 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు. మరోవైపు అధికారుల సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి.
- Advertisement -



